: వీఆర్ఎస్ తీసుకుంటానంటున్న జడ్జి వాసన్!


కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో కలత చెందిన జడ్జి వాసన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించడం, ఈ వ్యవహారంలో సీఎంఫై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు జడ్జి అయిన వాసన్ ఆదేశించడం తెలిసిందే. ఈ తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించడంతో పాటు, తన పరిధిని తెలుసుకోకుండా విజిలెన్స్ కోర్టు ప్రవర్తించిందంటూ మందలించింది. ఈ నేపథ్యంలోనే వాసన్ వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News