: బాధ్యత నాపై ఉంది...ఓటమి నిరాశకు గురి చేసింది: వాట్సన్


రెండో టీట్వంటీలో కూడా ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసిందని షేన్ వాట్సన్ తెలిపాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొడ కండరాలు పట్టేయడంతో మీడియా ముందుకు రాలేకపోయాడని తెలిపిన షేన్ వాట్సన్, ఫించ్ అద్భుతంగా ఆడాడని కితాబునిచ్చాడు. ఫించ్ ఇచ్చిన శుభారంభాన్ని జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయిందని వాట్సన్ చెప్పాడు. మిడిల్ ఆర్డర్ వైఫల్యం కావడంతో ఆసీస్ ఓటమిపాలైందని ఆయన పేర్కొన్నాడు. మిడిలార్డర్ లో రాణించాల్సిన బాధ్యత, ముందుండి విజయం దిశగా జట్టును నడిపించాల్సిన బాధ్యత తనపై ఉన్నాయని వాట్సన్ అన్నాడు. తాను విఫలం చెందడం జట్టు ఓటమికి ఒకకారణమన్న వాట్సన్, ఓటమికి బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. ఫించ్ తొడకండరాలు పట్టేశాయని తెలిపిన వాట్సన్, అయితే అది పెద్ద గాయం కాదని తెలిపాడు.

  • Loading...

More Telugu News