: మ్యాక్స్ వెల్ వచ్చేశాడు... మరికాసేపట్లో రెండో టీ20


భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి వన్డేలో ‘మెన్ ఇన్ బ్లూ’ జూలు విదిల్చారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుపులు మెరిపించిన టీమిండియా క్రికెటర్లు ఆసీస్ ను కోలుకోలేని దెబ్బ తీశారు. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఏ ఒక్క దశలోనూ విజయం ఆసీస్ వైపు మొగ్గలేదు. అయితే ఆ మ్యాచ్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులో లేడు. ఈ కారణంగానే ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటింగ్ తేలిపోయింది. తాజాగా మరికాసేపట్లో మెల్ బోర్న్ లో జరనున్న రెండో టీ20 మ్యాచ్ కు మ్యాక్స్ వెల్ అందుబాటులోకి వచ్చాడు. ఇక గెలుపుతో రెట్టించిన విజయోత్సాహంతో ఉరకలెత్తుతున్న టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే ఫస్ట్ టీ20కి ఆడిన జట్టును రెండో టీ20కి దించుతోంది.

  • Loading...

More Telugu News