: టీడీపీకి వస్తున్న స్పందన చూసే కేసీఆర్ విమర్శలు... చంద్రబాబుతో నేతలు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన నివాసంలో టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార విధాంనపై అధినేతతో చర్చించారు. రెండు రోజుల నుంచి నగరంలో తమ పార్టీ ప్రచారం ఊపందుకుందని, ప్రజల నుంచి కూడా స్పందన బాగానే వస్తోందని చంద్రబాబుకు నేతలు వివరించారు. అలా టీడీపీకి వస్తున్న స్పందన చూసే సీఎం కేసీఆర్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గంలోని పాటిగడ్డ బసవతారకమ్మనగర్ చౌరస్తా వద్ద బహరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.