: కోట్ల విలువ చేసే భూమిని హేమమాలినికి కారు చౌకగా కట్టబెట్టారు!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదంలో చిక్కుకున్నారు. నెల కిందట ముంబై అంధేరీ ప్రాంతంలో ఖరీదైన స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించినట్టు ఆర్టీఐ కార్యకర్త అనిల్ గాల్గాలీ సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టారు. ఇక్కడ 2వేల చదరపు మీటర్ల స్థలాన్ని చదరపు మీటరుకు రూ.35 చొప్పున ధర నిర్ణయించి రూ.70వేలకు కలెక్టర్ ధారాదత్తం చేసినట్టు రికార్డులో నమోదైంది. హేమ ఏర్పాటు చేసే భరతనాట్యం డాన్స్ పాఠశాల కోసం ఈ స్థలం కేటాయించారని పేర్కొన్నారు. 1976 నియమాల ప్రకారమే స్థలానికి ధర నిర్ణయించామని అధికారులు వెల్లడించారు. అయితే బీజేపీ ఎంపీ కావడంవల్లే ఆమెకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించి తక్కువ ధరకే స్థలాన్ని ఇచ్చిందని అనిల్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సీఎం ఫడ్నవీస్ కు లేఖ రాశానని తెలిపారు. గతంలో కూడా ఆమెకు వెర్సోవా ప్రాంతంలో స్థలం కేటాయిస్తే ఇంతవరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేయలేదన్నారు.