: రెండో టీ20 నేడే... సిరీస్ పై కన్నేసిన ధోనీ సేన


ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ దేశ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా రెండో టీ20ని ఆడనుంది. ఇప్పటికే ఫస్ట్ టీ20లో ఆసీస్ ను మట్టి కరిపించిన ధోనీ సేన, వరుసగా ఈ మ్యాచ్ లోనూ గెలిచి టైటిల్ ను చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ముగిసిన వన్డే సిరీస్ పరాభవానికి టీ20 కప్ ను అందుకుని ఆసీస్ కు గట్టిగానే బదులివ్వాలని టీమిండియా భావిస్తోంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో రెండు జట్లు పెద్దగా మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగనున్నాయి.

  • Loading...

More Telugu News