: జంటనగరాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చా!: గ్రేటర్ ప్రచారంలో బాబు


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం ప్రారంభించారు. పటాన్ చెరు నుంచి ఆయన ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్పొరేటర్లను గెలిపించుకోవాలని ఆయన కోరారు. హైదరాబాదుకు అంతర్జాతీయ స్థాయిని కల్పించింది టీడీపీ అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం తెచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన చెప్పారు. మెట్రోరైల్ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది తానేనని ఆయన తెలిపారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన మెట్రోరైల్ ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ఆయన నిలదీశారు. కేవలం సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించేందుకు ఆంగ్లేయులకు వందేళ్లు పడితే, జంటనగరాలకు అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు తనకు కేవలం తొమ్మిదేళ్లు పట్టిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News