: చెవిలో పువ్వుతో కార్మికుల వినూత్న నిరసన!


నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) కార్మికులు చెవిలో పువ్వు పెట్టుకుని తమ వినూత్న నిరసన తెలిపారు. ‘నిజాం షుగర్స్’ పై ప్రభుత్వం ఇచ్చిన హామీ చెవిలో పువ్వు పెట్టినట్లు ఉందని, అందుకే తాము ఈ విధంగా నిరసన వ్యక్తం చేశామని నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఎన్డీఎస్ఎల్ కార్మికులు అన్నారు. పరిశ్రమ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని అన్నారు. ఈ పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News