: ఫేస్ బుక్ లో చేరనున్న ఆరు కొత్త ఎమోషన్ బటన్స్
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పోస్టుకు ప్రస్తుతం లైక్, కామెంట్, షేర్ అనే బటన్ లు ఉన్న విషయం తెలిసిందే. వాటితో పాటు మరో ఆరు ఎమోషన్స్ తో కొత్త బటన్స్ అందుబాటులోకి రానున్నాయని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. కోపం, బాధ, హ్హహ్హ, ప్రేమ ఎమోషన్స్ కు గుర్తులుగా ఈ బటన్స్ ను చేర్చనున్నామని చెప్పారు. ఫేస్ బుక్ పోస్టుకు కేవలం లైక్ మాత్రమే కాకుండా కస్టమర్స్ తమ ఎమోషన్స్ తెలియజేసేలా ఈ సదుపాయాన్ని తీసుకువస్తున్నామని జుకర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఎమోషన్స్ ను చిలీ, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, ఐర్లాండ్, స్పెయిన్, జపాన్, కొలంబియాలలో పరీక్షిస్తున్నారు. త్వరలోనే ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.