: యోగా తరగతులకు ఆర్మీ జవాన్లు!...రాందేవ్ బాబా ఆధ్వర్యంలో 2 వారాల శిక్షణ
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో యోగాకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగా తరగతులను ప్రారంభించిన మోదీ సర్కారు, తాజాగా సైనికులనూ ఆ బాట పట్టించింది. హర్యానాలోని హరిద్వార్ లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు మొట్టమొదటిసారిగా సైనికులు హాజరయ్యారు. సైన్యంలోని ‘వెస్టర్న్ కమాండ్’కు చెందిన 250 మంది సైనికులు రెండు వారాల పాటు యోగాలో శిక్షణ పొందారు. మంగళవారంతో వీరి శిక్షణ తరగతులు ముగిశాయి. తదుపరి జరగనున్న శిక్షణా తరగతులకు మరో 750 మంది సైనికులు హాజరుకానున్నారు. వెరసి 1,000 మంది సైనికులను యోగా ట్రైనర్లుగా తీర్చిదిద్దనున్నారు. హరిద్వార్ లో శిక్షణ తీసుకున్న సైనికులు ఇతర సైనికులకు యోగాసనాలను నేర్పించనున్నారు.