: బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నేడే... పార్టీ చీఫ్ గా అమిత్ షాకు బాధ్యతలు


కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)లో కీలక పార్టీ బీజేపీ నేడు కీలక భేటీ కానుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండో పర్యాయం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నేటి భేటీలో ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది.

  • Loading...

More Telugu News