: ఆస్ట్రేలియా ఓపెన్.. ఫైనల్స్ కు చేరిన సానియా జోడీ!


సుమారు ఏడాదిన్నర కాలంగా ఓటమి ఎరుగని సానియా-హింగిస్ జోడి ఆస్ట్రేలియా ఓపెన్ లోనూ దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్ లో సానియా-హింగిస్ జోడి ఫైనల్ కు చేరింది. ఈరోజు జరిగిన సెమీ ఫైనల్లో గోర్జెస్- ప్లిస్కోవా జోడీపై సానియా జోడీ చెలరేగి ఆడింది. 6-1, 6-0 తేడాతో సానియా-హింగిస్ జోడి సునాయాసంగా గెలిచింది. జర్మన్-జెక్ జోడీపై కేవలం 54 నిమిషాల్లో ఇండో- స్విస్ జోడీ సానియా-హింగిస్ లు విజయం సాధించారు. ఈ విజయంపై సానియా మాట్లాడుతూ, తమ సాన్నిహిత్యం కేవలం టెన్నిస్ కోర్టుకే పరిమితం కాదని, మిగిలిన సమయాల్లో కూడా తాము ఆప్యాయంగా ఉంటామని.. తన విజయం వెనుక రహస్యం ఇదేనని సానియా చెప్పింది.

  • Loading...

More Telugu News