: కన్న తండ్రికి అన్నం పెట్టని నాయకుడికి ఓటేయమనడం సిగ్గుచేటు: టీడీపీ నేత రేవంత్ రెడ్డి


కన్న తండ్రికి అన్నం పెట్టని నేత భూపాల్ రెడ్డికి టీఆర్ఎస్ ఓటేయమనడం సిగ్గుచేటని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఈరోజు బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ కు కేడర్ లేదని, సిద్ధిపేట నుంచి నాయకులను తీసుకువచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని అన్నారు. హరీశ్ ను కేసీఆర్, కేటీఆర్ నగర బహిష్కరణ చేశారని.. అర్ధరాత్రో, అపరాత్రో హరీశ్ హైదరాబాద్ వస్తాడని, ఆయన చుట్టూ ఇంటిలిజెన్స్ పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలకెక్కిన నిషా దిగేలా ప్రజలు బుద్ది చెప్పాలని, హరీశ్ పంచే డబ్బులు తీసుకుని టీడీపీకే ఓటు వేయాలని రేవంత్ అన్నారు.

  • Loading...

More Telugu News