: ఆమె చేసిన ఒకే ట్వీట్...12 మిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చింది


కేవలం ఒకే ఒక్క ట్వీట్ 12 మిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చిపెట్టింది. సెలబ్రిటీల పోస్టులకు అంతులేని ఆదరణ ఉంటుంది. టీవీ ప్రెజంటర్ ఓప్రా విన్ ఫ్రే కు అమెరికాలో అశేషమైన ప్రేక్షకాదరణ ఉంది. ఆమె ఏం చెప్పినా అది విశేషమే. అలాంటి విన్ ఫ్రే...'బ్రెడ్ తినండి...బరువు తగ్గండి...నమ్మకం లేదా? అయితే నా దగ్గరకు రండి' అనే శీర్షికతో 'వెయిట్ వాచర్స్' అనే సంస్థతో తన అనుబంధం గురించి 30 సెకెన్ల నిడివిగల ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో పోస్టు చేసిన గంటకే వెయిట్ వాచర్స్ షేర్లు ఒక్కసారిగా రెండు డాలర్లు చొప్పున పెరిగాయి. ఈ సంస్థలో విన్ ఫ్రేకి 6 మిలియన్ల షేర్లు ఉన్నాయి. దీంతో కేవలం గంటలోనే ఆమెకు 12 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.

  • Loading...

More Telugu News