: నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది: ప్రియాంక చోప్రా
కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం పట్ల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉబ్బితబ్బిబవుతోంది. ఈ సంవత్సరం తనకు బాగా కలిసొచ్చిందని, తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన శ్రమ, ప్రతిభను గుర్తించినందుకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని పీసీ తెలిపింది. తాను నటించిన దిల్ దడకనే దో, క్వాంటికో, బాజీరావ్ మస్తానీలకు పీపుల్స్ ఛాయిస్ అవార్డులతో పాటు ఇప్పుడీ పురస్కారం రావడం ఆనందంగా ఉందని చెప్పింది. నిజం చెప్పాలంటే తన కల నిజమైందని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ఓ ఆర్మీ అధికారి కుమార్తెగా ఈ పురస్కారం అందుకుంటున్నందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది.