: సిద్ధిపేట, నారాయణ ఖేడ్ నాకు రెండు కళ్లు: హరీశ్ రావు
ఫిబ్రవరిలో జరిగే నారాయణ ఖేడ్ ఉపఎన్నికకు మంత్రి హరీశ్ రావు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి తరపున ఇక్కడ కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. తన నియోజకవర్గం సిద్ధిపేట, ప్రస్తుత ఎన్నిక స్థానం నారాయణ ఖేడ్ రెండూ తనకు రెండు కళ్లలాంటివని అన్నారు. ఈ ఉప ఎన్నికలు అణచివేతకు, అభివృద్ధికి మధ్య పోరాటం అని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదని హరీశ్ ఆరోపించారు. మూడు సంవత్సరాలలో నారాయణఖేడ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.