: ఆన్ లైన్లో వాటర్ ఫిల్టర్ బుక్ చేస్తే...ఇటుక వచ్చింది!


ఆన్ లైన్ మోసాలు జోరందుకుంటున్నాయి. ఆఫర్ల పేరిట వినియోగదారులకు గాలం వేస్తున్న ఈ-కామర్స్ సంస్థలు డబ్బులు చెల్లించిన వినియోగదారులకు సరైన వస్తువులు అందజేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థల లేక కొరియర్ సంస్థల చేతివాటమో తెలియని వినియోగదారులు వస్తువులు ఇంటికి తీసుకెళ్లి చూసుకుని అవాక్కైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన బాల్ రెడ్డి స్నాప్ డీల్ లో 8,000 రూపాయలు పెట్టి వాటర్ ఫిల్టర్ ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశారు. ఆయన ఆర్డర్ చేసినట్టే స్నాప్ డీల్ నుంచి ఓ పార్సిల్ ఆయనకు చేరింది. వాటర్ ఫిల్టర్ వచ్చిందని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేసిన బాల్ రెడ్డి షాక్ కు గురయ్యాడు. వాటర్ ఫిల్టర్ స్థానంలో ఇటుక రాయి ఉంది. దీంతో బాల్ రెడ్డి ఈ మోసం స్నాప్ డీల్ చేసినదా? లేక కొరియర్ సంస్థ చేసినదా? నిగ్గుతేల్చే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News