: వీసీ పోస్టుకి 14 కోట్లు వసూలు చేస్తున్నారు: ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు


యూనివర్సిటీల్లో వీసీ పోస్టుకి 14 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని టీఎన్ సీసీ చీఫ్ ఈవీకేఎస్ ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, విద్యాలయాలు విలువలు మరిచాయని అన్నారు. విద్యాలయాల ద్వారా ప్రభుత్వం ధనార్జనకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. 12 నుంచి 14 కోట్ల రూపాయలు చెల్లించి యూనివర్సిటీ వీసీ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు ఆయా విద్యాసంస్థలను ఫక్తు వ్యాపార సంస్థలుగా మార్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వీసీలు పేద, దళిత వర్గాలు ఉన్నత విద్యనభ్యసించేందుకు సముఖంగా లేరని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News