: ధాటిగా ఆసీస్...వ్యూహంతో భారత్...బుమ్రాకే తొలి వికెట్


టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు సునాయాసంగా ఛేదించే దిశగా దూసుకెళ్తోంది. ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం ముందు టీమిండియా బౌలింగ్ వనరులు తీసికట్టుగా మారాయి. టీట్వంటీ స్పెషలిస్ట్ ఆశీష్ నెహ్రాను ఆసీస్ ఓపెనర్లు తుత్తునియలు చేశారు. తమ ముందుకు వచ్చిన ప్రతి బంతీ బౌండరీ లైన్ దాటేందుకే వచ్చిందన్నట్టుగా ఆసీస్ బ్యాట్స్ మన్ పరుగులు రాబట్టుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు కేవలం 5 ఓవర్లలోనే 50 పరుగులు సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (17), ఆరోన్ ఫించ్ (28) ధాటిగా ఆడారు. ఈ క్రమంలో బమ్రా సంధించిన షార్ట్ లెంగ్త్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 47 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు. టీమిండియా వ్యూహం మార్చుతూ నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజాలను ప్రయోగించింది.

  • Loading...

More Telugu News