: ఆ గ్రామంలో జాతీయ జెండా తొలిసారి ఎగిరింది!
ఆ గ్రామంలో ఇప్పటి వరకు జాతీయ జెండా ఎగురవేయలేదు. జెండా వందనం ఎట్లా ఉంటుందో అక్కడి గ్రామస్తులకు తెలియదు. అయితే, 67వ గణతంత్ర దినోత్సవం రోజున జెండా పండగ ఎట్లా ఉంటుందో ఆ గ్రామస్తులు తెలుసుకున్నారు.. ఆనందించారు. ఆదిలాబాద్ జిల్లా టాక్లి గ్రామంలో తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలాడింది. 67వ గణతంత్ర దినోత్సవం రోజున ఆ గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేశారు. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేని ఈ గ్రామం దుస్థితిపై ఒక ఛానల్ కథనం మేరకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ గ్రామానికి ప్రభుత్వ పథకాలేవీ ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.