: 90 ఏళ్ల వృద్ధురాలికి జైలు నుంచి విముక్తి


కోడలి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలు ఈ ఉదయం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైంది. దాదాపు 15 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ మహిళ హత్య జరుగగా, ఆమె అత్త రుక్మిణమ్మపై ఆరోపణలు నమోదయ్యాయి. కేసు విచారణలో ఆమె దోషని తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. దాదాపు 13 ఏళ్లుగా జైల్లో ఉన్న ఆమె, సత్ప్రవర్తనతో మెలగుతుండటంతో, ఈ ఉదయం ఏపీ ప్రభుత్వం విముక్తిని ప్రసాదించిన 400 మందిలో రుక్మిణమ్మ పేరు కూడా వచ్చింది. దీంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చింది. కాగా, ఈ ఉదయం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన 124 మందిలో 14 మంది మహిళా ఖైదీలు, 110 మంది పురుషులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News