: సెరెనా చేతిలో షరపోవా చిత్తు... వరుసగా 18వ సారి ఓటమి
నల్లకలువ చేతిలో అందాల సుందరికి మరో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నేటి ఉదయం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ చేతిలో రష్యా క్రీడాకారిణి మారియా షరపోవా చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన షరపోవాను సెరెనా వరుస సెట్లలో (6-4, 6-1) చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో సునాయాస విజయంతో సెరెనా టైటిల్ పోరుకు మరో రెండడుగుల ముందు (సెమీ ఫైనల్) నిలిచింది. ఈ మ్యాచ్ లో ఓటమితో షరపోవా, సెరెనా చేతిలో వరుసగా 18 మ్యాచ్ ల్లో ఓడిననట్లైంది.