: రాజమౌళికి పద్మశ్రీ ... నాకు చిన్నప్పటి స్వీట్ హార్ట్ 'పద్మ' కూడా దక్కలేదంటున్న రాంగోపాల్ వర్మ
బాహుబలిని అద్భుత రీతిన తెరకెక్కించి, ప్రపంచ వ్యాప్తంగా పేరుతో పాటు 2016 సంవత్సరానికిగాను పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న రాజమౌళిపై, దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. "రాజమౌళికి పద్మశ్రీ లభించింది. నేనైతే నా చిన్నప్పటి స్వీట్ హార్ట్ 'పద్మ'ను కూడా దక్కించుకోలేకపోయాను. ఇది బాహుబలియన్ వైఫల్యం అని నేను అనుకుంటున్నాను" (Rajamouli got Padmashree and I dint even get my childhood sweetheart Padma... This i think is a Bahubalian failure) అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాజమౌళికి వచ్చిన అవార్డును తనదైన స్టేట్ మెంట్ తో వర్మ స్పందించిన తీరు నెటిజన్లలో ఇప్పుడు వైరల్ అవుతోంది.