: ముందు మీ సంగతి చూసుకోండి: అచ్చెన్నాయుడికి క్లాస్ పీకిన చంద్రబాబు
తన శాఖను వదిలేసి ఇతర శాఖల విషయాలను చర్చించబోయిన మంత్రి అచ్చెన్నాయుడిని చంద్రబాబు నిలువరించారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో ఈ ఘటన జరగగింది. రోడ్లు భవనాల శాఖపై చర్చ జరుగుతున్న వేళ, అచ్చెన్నాయుడు కల్పించుకుని రహదారులు బాగాలేవని, తక్షణం మరమ్మతులు చేయాల్సి వుందని చెబుతూ, నిధుల అవసరం ఉందని అన్నారు. అచ్చెన్నాయుడిని అడ్డుకున్న చంద్రబాబు, తొలుత మీ శాఖ సంగతి చూసుకోవాలని, ఇతర మంత్రుల శాఖల్లో వేలెందుకని క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ నిర్వహిస్తున్న రహదారులను, ఆర్ అండ్ బీకి బదిలీ చేయాలని తాను చెప్పినా, ఇంకా చేయలేదెందుకని అధికారులపై చంద్రబాబు మండిపడ్డారు.