: రామోజీ ఫిల్మ్ సిటీని తలదన్నేలా తెలంగాణలో ప్రభుత్వ స్టూడియో: జయేశ్ రంజన్


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామోజీ ఫిల్మ్ సిటీని తలదన్నేలా మరో అత్యాధునిక, సువిశాల సినీ స్టూడియో నిర్మించాలన్నది సీఎం కేసీఆర్ ఆశయమని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ సదస్సు జరుగగా, దీనికి హాజరైన టాలీవుడ్, బాలీవుడ్ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఈ స్టూడియో ఉంటుందని, దీని నిర్మాణంలో భాగం పంచుకోవాలని సినీ ప్రతినిధులను ఆయన కోరారు. పైరసీని అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని అన్నారు. వెబ్ సైట్లను బ్లాక్ చేసే అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, ఆ అధికారం రాష్ట్రాల స్థాయిలో ఉండాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ లో గేమింగ్ యానిమేషన్ క్లస్టర్ కోసం 10 ఎకరాల స్థలం, రూ. 500 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News