: మేమందరం కలవడం చాలా సరదాగా ఉంది: దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ
తామందరం కలవడం చాలా ఫన్ గా ఉందని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఐఫా అవార్డుల వేడుకలో ఆయన పాల్గొన్నారు. నాలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, మొదలైన వారు ఒక వేదికపై కలవడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఈ వేడుకలు జరుగుతున్న రోజే... ‘పద్మ’ అవార్డులు ప్రకటించడం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు రాజమౌళికి ‘పద్మ’ అవార్డులు రావడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఒకేచోట కలవడం అన్నది చాలా కష్టమని, ఎందుకంటే, ఎవరికి వాళ్లు చాలా హడావిడిగా ఉంటారని అన్నారు. ఎప్పటి నుంచో తామందరం కలవాలనుకున్నామని.. అందుకు ఐఫా వేదికగా నిలిచిందని తమ్మారెడ్డి అన్నారు.