: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు


ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఫ్ పై తనదైన శైలిలో వివాదాస్పదంగా మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే హైదరాబాద్ లో బీఫ్ తినే అవకాశం కోల్పోతామని వ్యాఖ్యానించారు. శివసేన, బీజేపీ కూటమి గెలిచిన ముంబైలో వారం రోజుల పాటు బీఫ్ అమ్మకాలను నిలిపివేశారని ప్రస్తావించారు. అందుకే బీఫ్ తినేవారు తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లకు అసద్ పిలుపునిచ్చారు. గత మూడు నెలల నుంచి సద్దుమణిగిన బీఫ్ నినాదాన్ని మళ్లీ గ్రేటర్ ప్రచారంలో తెరపైకి తెచ్చిన అసద్... ఈ అంశంతో లబ్ధి పొందాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News