: ఐఫాలో తమిళ 'బాహుబలి'కి అవార్డుల పంట
హైదరాబాద్ వేదికగా తొలిసారి ఐఫా ఉత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంలో మొదటిరోజు వేడుకలో తమిళం, మలయాళం భాషల్లో ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు అందజేశారు. ప్రధానంగా తమిళ 'బాహుబలి' చిత్రానికి ఏడు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ ప్రొడక్సన్ డిజైన్ విభాగాలలో అవార్డులు ప్రకటించారు. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.