: పాక్ బౌలర్ బౌన్సర్ తగిలి కుప్పకూలిన న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ మెక్ క్లాన్
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అన్వర్ అలీ వేసిన బంతికి న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ మెక్ క్లాన్ గన్ మైదానంలోనే కుప్పకూలాడు. నేడు వెల్లింగ్టన్ లో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వన్డే పోరులో జరిగిన ఈ ఘటన మ్యాచ్ కి చాలా సేపు అంతరాయం కలిగించింది. అన్వర్ వేసిన బౌన్సర్ హెల్మెట్ ను దాటి మరీ ఎడమ కన్నుకు బలంగా తగలడంతో మిచేల్ కు రక్తస్రావం కాగా, మైదానంలో కిందపడి విలవిల్లాడాడు. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు మిచెల్ ను ఆసుపత్రికి తరలించారు. కంటి చుట్టూ ఉన్న ఎముకలు విరిగాయని వెల్లడించిన వైద్యులు, గాయానికి కుట్లు వేశారు. చికిత్స తరువాత స్పృహలోకి వచ్చిన మిచెల్ తాను క్షేమమేనని ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. తన తాజా చిత్రాన్ని తీసి పోస్ట్ చేశాడు. కాగా, కంటి ఎముక విరగడంతో, ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి వుందని వైద్యులు వెల్లడించారు.