: మల్లాది విష్ణుకు రూ. 600 కోట్ల ఆస్తులు!


విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయని, ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కనుగొన్నట్టు తెలుస్తోంది. ఆయనకు దాదాపు రూ. 600 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కనుగొన్న సిట్ అధికారులు, ఆ వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరుకు అప్పగించినట్టు సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సేకరించిన సమాచారాన్ని మదింపు చేసిన అధికారులు, విష్ణుకు అమరావతి ప్రాంతంలో 28 ఎకరాల భూమి ఉన్నట్టు గమనించారని తెలుస్తోంది. కాగా, ఈ వార్తలు అవాస్తవమని, తనకు అంత భారీ ఆస్తులేమీ లేవని విష్ణు అంటుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News