: ఆస్ట్రేలియాలో సత్తా చాటిన భారత టెన్నిస్ బృందం... అందరూ గెలిచారు!


ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సోమవారం నాడు భారత క్రీడాకారులు పాల్గొన్న అన్ని పోటీల్లోనూ విజయం సాధించి తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు. ఉమెన్స్ డబుల్స్ మూడవ రౌండులో టాప్ సీడ్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ స్వెత్లానా కుజనెత్సోవా, రోబెర్టా విన్సీ జోడీపై 6-1, 6-3 తేడాతో విజయం సాధించింది. మిక్స్ డ్ డబుల్స్ రెండో రౌండు పోటీల్లో తైపే క్రీడాకారిణి యువాన్ జాన్ చాన్ తో జతకట్టిన రోహన్ బొప్పన్న చెక్ రిపబ్లిక్, పోలాండ్ జోడి ఆండ్రియా హల్వకోవా, లుకాస్ కుబోట్ లపై 4-6, 6-3 (10-6) తేడాతో గెలిచారు. జూనియర్ బాలికల విభాగంలో తెలుగు సంచలనం యడ్లపల్లి ప్రాంజల 7-6 (5), 6-3 తేడాతో మిరా ఆంటోనిట్స్ పై గెలిచి మూడవ రౌండుకు దూసుకెళ్లింది. జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో కర్మన్ తాండితో కలసి ఆడిన ప్రాంజల 6-4, 6-3 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన పెట్రా హ్యూల్, సెలినా తురుల్జా జోడీపై గెలిచి రెండో రౌండులోకి ప్రవేశించింది. దీంతో నేడు జరిగిన పోటీల్లో భాగంగా భారత క్రీడాకారులు పాల్గొన్న అన్ని పోటీల్లో విజయాలు వరించినట్లయింది.

  • Loading...

More Telugu News