: అమెరికాపై విరుచుకుపడ్డ మంచు తుపాన్...30 మంది మృతి, 11 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
అగ్రరాజ్యం అమెరికాపై మంచు తుపాన్ ముప్పేట దాడి చేస్తోంది. వారం రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా కురుస్తున్న మంచు నిన్న తీవ్ర రూపం దాల్చింది. భారీ ఎత్తున కురుస్తున్న మంచు తుపాను కారణంగా ఇప్పటిదాకా 30 మంది దాకా మృత్యువాతపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తుపాను నేపథ్యంలో రోడ్లపై 30 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ కారణంగా ఆ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కారు ప్రమాదలు చోటుచేసుకున్నట్లు సమాచారం. 9 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ సహా పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.