: కేసీఆర్, చంద్రబాబు మధ్య ఎటువంటి పంచాయతీ లేదు: కేటీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య ఎటువంటి పంచాయతీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని అన్నారు. ఈ విషయమై ప్రజల మధ్య అనవసర పంచాయతీలు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అందరం కలిసి పాటు పడదామని, భాగస్వాములమవుదామని ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News