: పాకిస్థాన్ లో స్వల్ప భూకంపం!
పాకిస్తాన్ లో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. స్వాత్ వ్యాలీతో పాటు ఉత్తర పాకిస్థాన్ లోని మాల్కంద్, చిత్రాల్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారుల నివేదిక వెల్లడించింది. ఈ సంఘటనతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత శాఖాధికారులు గుర్తించారు. తమకు అందిన సమాచారం ఈ సంఘటనలో ఎవరూ మృతి చెందలేదని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. కాగా, గత ఏడాది అక్టోబర్ లో స్వాత్ వ్యాలీలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఆఫ్గాన్, పాకిస్తాన్ దేశాల్లో సుమారు 300 మంది ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే.