: అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనే... సిఫార్సు చేసిన కేంద్రం


రాజకీయ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ ఉదయం మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీని రద్దు చేసే కంటే, దాన్ని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన సాగించాలన్న మంత్రుల సలహాకు మోదీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ఓ హోటల్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరిగిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 47 మంది ఎమ్మెల్యేలున్నా, సీఎంగా ఉన్న నబమ్ తుకికి వెనుక 26 మందే ఉన్నారు. గౌహతి హైకోర్టు సస్పెండ్ చేసిన 14 మందిని డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలోకి అనుమతించిన తరువాత నెలకొన్న రగడతో, అసెంబ్లీ సమావేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News