: బీజేపీ పగ్గాలు అమిత్ షా చేతికే!
ముందుగా ఊహించినట్టుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా మరోసారి ఎన్నికయ్యారు. ఈ ఉదయం అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగగా, నామినేషన్లకు సమయం ముగిసిన తరువాత, అమిత్ పేరిట మాత్రమే నామినేషన్ దాఖలు కాగా, ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికలు నిర్వహించిన పార్టీ సీనియర్లు ప్రకటించారు. కాగా, మరో మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉండనున్నారు. ఈ మూడేళ్ల కాలంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆపై సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది.