: సాహసాలు నేర్చుకోండి... ఎప్పుడైనా అవసరం పడొచ్చు: మోదీ
నేటి తరం బాలలు సాహసాలు చేయడం నేర్చుకోవాలని, భవిష్యత్తులో ఎన్నడైనా, ఎక్కడైనా సాహసం ప్రదర్శించాల్సి రావచ్చని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సాహస బాలలకు సన్మానం చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. నేటి బాలలే రేపటి పౌరులని, పౌరులుగా మారుతున్న దశలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగాలను సృష్టించే ఔత్సాహికులుగా మారాలని పిలుపునిచ్చారు. నిత్యమూ ఎక్కడో ఒకచోట విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అలాంటప్పుడు సాహసికులు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొందరు వీరులు చేసే సాహసం ఒక్కోసారి ఎన్నో ప్రాణాలను నిలుపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈ స్వభావం ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి నుంచే తమ విద్యార్థుల్లో సాహస కృత్యాలను నేర్పడంతో పాటు ధైర్యాన్ని నూరిపోయాలని సూచించారు.