: మంగళగిరి వద్ద టీడీపీకి నాలుగెకరాలు!


తెలుగుదేశం పార్టీ ఆఫీసు కార్యాలయ భవన నిర్మాణం నిమిత్తం రాజధాని అమరావతికి సమీపంలోని మంగళగిరి వద్ద నాలుగెకరాల భూమిని ఆ పార్టీ గుర్తించింది. దాన్ని పార్టీ ఆఫీసు నిమిత్తం కేటాయించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీంతో ఆ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించడం తథ్యమని తెలుస్తోంది. పూర్తి హంగులతో ఉండే భవంతి మోడల్ కూడా సిద్ధమైందని, దీనికి చంద్రబాబు ఓకే చెప్పేశారని తెలుస్తోంది. కాగా, టీడీపీకి స్థలం కేటాయిస్తే, మిగతా అన్ని పార్టీలు కూడా తమ కార్యాలయాలకు స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News