: విశాఖ సీతమ్మధారలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నం పరిధిలోని సీతమ్మధారలో ఈ తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఉడా (విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ) షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అధికారుల ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.