: పవన్ కల్యాణ్ ను ప్రచారానికి పిలవలేదు: కిషన్ రెడ్డి


జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ను ప్రచారానికి పిలవలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించనున్న ప్రచారంలో కేంద్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ-బీజేపీ కలిపి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని అన్నారు. 26వ తేదీ సాయంకాలం నిర్వహించనున్న రెండు సభలలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారని ఆయన చెప్పారు. ఆ రెండు సభలకు సంబంధించిన వివరాలను రేపు ఉదయం ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా కేంద్ర జౌళి శాఖా మంత్రి సంతోష్ గంగ్వార్, పలువురు నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News