: మరో ఉగ్రవాది అరెస్టు.. కంప్యూటర్లు, పేలుడు సామగ్రి స్వాధీనం!
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో మరో ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు అరెస్టు చేసింది. భారత్ లో పలు చోట్ల దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ ఛేదించడం, పలు ప్రాంతాల్లో 14 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం విదితమే. తాజాగా, ఔరంగాబాద్ లో ఉగ్రవాది ఇమ్రాన్ ఖాన్ పఠాన్ ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇమ్రాన్ నుంచి కంప్యూటర్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుంది. హైదరాబాదులో అరెస్టయిన ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, విచారణ అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీకి తరలించారు. కాగా, ఐఎస్ మద్దతుదారులు యూసఫ్, షఫీలను హరిద్వార్ లో నిన్న అదుపులోకి తీసుకున్నారు. ముంబై, మంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ విచారిస్తోంది. ముంబై, హైదరాబాద్ లో పట్టు బడిన వ్యక్తుల నుంచి ఎన్ఐఏ అధికారులు ఐఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.