: పారికర్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తాం: గోవా పోలీసులు
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కు జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తామని గోవా పోలీసులు ముందుకొచ్చారు. ఆయన గోవాలో ఉన్న సమయంలో ఈ సెక్యూరిటీని కల్పించేందుకు ఆమోదించాలని కోరారు. రక్షణ మంత్రిగా ఆయనకు అది అవసరమని ఆ రాష్ట్ర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ బ్రాంచ్) బోస్కో జార్జ్ తెలిపారు. సెక్యూరిటీ విషయమై పారికర్ కు కూడా సూచించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పారికర్ లను చంపుతామంటూ ఈ నెల 13న ఐఎస్ పేరుతో ఓ పోస్టు కార్డు గోవా సచివాలయానికి వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకునే పోలీసు శాఖ గట్టి రక్షణ ఏర్పాట్లు చేస్తోంది.