: 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' రోహిత్...'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' పాండే
భారత జట్టు వన్డే సిరీస్ ను ఓడిపోయినప్పటికీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను గెలుచుకుంది. సిరీస్ లో రెండు సెంచరీలు సాధించి, ఒక సెంచరీ ముంగిట అవుటైన రోహిత్ శర్మను 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు వరించగా, చివరి వన్డేలో ఒత్తిడిని జయంచి భారత జట్టును విజయతీరాలకు చేర్చిన మనీష్ పాండే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు. మ్యాచ్ గెలిచినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. సిరీస్ ఓటమిపాలవ్వడం బాధించిందని వారిద్దరూ అన్నారు. ముందు మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఓటమిపాలయ్యామని వారు అభిప్రాయపడ్డారు.