: మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కేజ్రీవాల్ మైనపు విగ్రహం!


లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం తొలిసారిగా భారతదేశానికి చెందిన ఓ ముఖ్యమంత్రి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. అది కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విగ్రహం కావడం విశేషం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు కేజ్రీవాల్ మైనపు బొమ్మను మాత్రం ఢిల్లీలో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పలు దేశాల్లో తన మ్యూజియంలను ఏర్పాటు చేసిన టుస్సాడ్స్ మరో మ్యూజియంను ఢిల్లీలో నెలకొల్పుతోంది. టుస్సాడ్స్ మ్యూజియంకు భారతీయ పార్టనర్ అయిన విజ్ క్రాప్ట్ ఎంటర్ టైన్ మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మేరకు కేజ్రీ వాల్ కు ఈ నెల 11న ఓ లేఖ రాసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటివారంలో విజ్ క్రాప్ట్ ప్రతినిధులు కేజ్రీని కలసి ప్రాజెక్టు గురించి చర్చిస్తారు. వచ్చే సంవత్సరం కల్లా ఢిల్లీలో ఆకర్షణీయమైన మైనపు విగ్రహాల మ్యూజియంను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందులో మొదటిగా కేజ్రీవాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం మరో విశేషంగా చెప్పాలి. గతేడాది నవంబర్ లో లండన్ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లినప్పుడు ఢిల్లీలో మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు టుస్సాడ్స్ మ్యూజియం వర్గాలు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News