: హీరోకి స్పీడెక్కువ.. దర్శకనిర్మాతలకు సహనమెక్కువ: చంద్రబోస్


'ఈ హీరోకి స్పీడెక్కువ.. దర్శకనిర్మాతలకు సహనమెక్కువ' అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న 'స్పీడున్నోడు' చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ ఫంక్షన్ లో పాల్గొన్న గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, వేగం, సహనం కలిస్తే విజయం ఖాయమని, ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ చిత్రంలో తాను మూడు పాటలు రాశానని చంద్రబోస్ చెప్పారు. కాగా, ఈ ఫంక్షన్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మిల్కీ బ్యూటీ తమన్నా, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News