: ఇంకా ధోనీని తొలగించరా?: ఎర్రపల్లి ప్రసన్న సూటి ప్రశ్న


మూడు వన్డే సిరీస్ లను కోల్పోయినా ధోనీని కెప్టెన్సీ బాధ్యల నుంచి తప్పించరా? అని మాజీ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ ఎర్రపల్లి ప్రసన్న ప్రశ్నించాడు. ధోనీ టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే మంచిదని ఆయన తెలిపాడు. తాను సెలక్షన్ కమిటీలో ఉండి ఉంటే ధోనీని బాధ్యతల నుంచి తప్పించి కోహ్లీకి పట్టం కడతానని అన్నాడు. ధోనీని బ్యాట్స్ మన్, కీపర్ గా కొనసాగించడమే మేలని ప్రసన్న స్పష్టం చేశాడు. ఇప్పుడే ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తే, జట్టుకు దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరుతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. టీట్వంటీ వరల్డ్ కప్ కెప్టెన్ గా అతనిని నియమించిన నిర్ణయాన్ని సెలక్టర్లు సమీక్షించుకోవాలని ఆయన సూచించాడు. ధోనీ కెప్టెన్సీకి కాలం చెల్లిందని ప్రసన్న తెలిపాడు.

  • Loading...

More Telugu News