: రోహిత్ 'ఎస్సీ మాల' సర్టిఫికెట్ తీసుకున్న విషయం నాకు తెలియదు: తండ్రి మణికుమార్
రోహిత్ 'ఎస్సీ మాల' సర్టిఫికెట్ తీసుకున్న విషయం తనకు మొదట్లో తెలియదని తండ్రి మణికుమార్ పేర్కొన్నారు. రోహిత్ డిగ్రీలోకి వచ్చినప్పుడు ఈ విషయం తనకు తెలిసిందని చెప్పారు. ఈ విషయమై తన కొడుకును ప్రశ్నిస్తే, అమ్మ, అమ్మమ్మ ఈ సర్టిఫికెట్ తీసుకోమన్నారని రోహిత్ తనకు చెప్పాడని అన్నారు. ‘ఎందుకురా ఇది?’ అని తాను మళ్లీ ప్రశ్నించగా, ‘చదువుకు మంచిదని వాళ్లు తీసుకోమన్నారని’ సమాధానం చెప్పాడన్నారు. తన కొడుకులు మెరిట్ విద్యార్థులని.. ఈ సర్టిఫికెట్లతో వారికేమవసరముందో తనకు అర్థం కాలేదని మణికుమార్ అన్నారు.