: మంటల్లో చిక్కుకుపోయి... సజీవ దహనమైన చిన్నారులు!


ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదలో పొలం వద్ద గుడిసెలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ వద్ద ఈరోజు జరిగింది. పొలం వద్ద గుడిసెలో అడ్డాకుల రాకేష్(4), తన మామయ్య కొడుకు రోహిత్ (3)తో కలిసి ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు గుడిసెకు సమీపంలో ఉన్న వరికుప్పలకు నిప్పు అంటుకోవడంతో, ఆ మంటలు గుడిసెకు వ్యాపించాయి. దీంతో ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోవడంతో సజీవదహనమయ్యారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News