: రోహిత్ ఆత్మహత్యపై జ్యుడిషియల్ విచారణకు కేంద్రం ఆదేశం
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ మృతిపై జ్యుడీషియల్ (న్యాయ) విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయవిచారణకు కేంద్ర మానవ వనరుల శాఖ ద్విసభ్య కమిటీని వేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో మూడు నెలల్లోగా న్యాయవిచారణ జరిపి నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఈ ఘటనపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. యూనివర్సిటీల్లో విద్యార్థులపై వివక్షను కేంద్ర మనవ వనరులు శాఖ సహించదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.