: రోహిత్ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. లక్నోలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, వేముల రోహిత్ కు ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన పరిస్థితి రావడం శోచనీయమని ఆయన చెప్పారు. భరతమాత, విద్యామాత ఓ ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆయన అన్నారు. భావి భారత దేశం ఓ మేధావిని పోగొట్టుకుందని ఆయన పేర్కొన్నారు. అంతా రాజకీయాలను పక్కన పెట్టి రోహిత్ తల్లి శోకాన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. అంబేద్కర్ ఆర్థిక విధానాలను విస్మరించి దేశం ముందుకువెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. దేశం ఆయన సూచించిన మార్గంలో నడవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. యువత బాధ్యతలను మరువకూడదని ఆయన సూచించారు. కఠిన మార్గంలో నడవాల్సి వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోకూడదని ఆయన సూచించారు. భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు అంతా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత కేవలం ఉద్యోగాలు చేయడం గురించే కాకుండా, ఉద్యోగాల కల్పన గురించి కూడా ఆలోచించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News